Agoras at Kadapa: వారణాసి నుంచి వచ్చిన అఘోరాలు కడప ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. వివిధ జిల్లాల్లోని ఎస్పీ కార్యాలయాలకు వెళ్లి.. ఎస్పీలను కలిసి ఆశీర్వాదం ఇచ్చినట్లు వారు తెలిపారు. అందులో భాగంగానే కడపకు అఘోరాల బృందం వచ్చింది. ఒంటినిండా విభూధి ధరించి.. రుద్రాక్ష మాలలు, త్రిశూల నామాలు దిద్దుకున్న అఘోరాలను ఆసక్తిగా తిలకించారు.
జిల్లా ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో చాలాసేపు కార్యాలయంలో వేచిచూశారు. పలువురు పోలీసు అధికారులకు విభూధి ఇచ్చి ఆశీర్వదించారు. ఇతర ప్రాంతాల్లో ఎస్పీలను ఆశీర్వదించిన ఫోటోలను సిబ్బందికి చూపించారు.