కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సి. కమ్మ పల్లికి చెందిన వృద్ధ దంపతులైన వెంకట సుబ్బయ్య , సుబ్బమ్మ వయస్సు 80 సంవత్సరాలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. తమ కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడని ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకొని కొడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని సైతం స్వాధీనం చేసుకున్నాడని వాపోయారు. ఎక్కడికైనా పోయి బతకమని తమ కొడుకు చెబుతున్నాడని ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక తమకు న్యాయం చేయాలని పోలీసుల దగ్గరకు వచ్చినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కుమారుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
'కన్నవారినే ఇంటి నుంచి గెంటేసిన సుపుత్రుడు..!'
ముదిమి వయసులోని తల్లిదండ్రులు తనకు భారం అనుకున్నాడు ఆ సుపుత్రుడు. వృద్ధులన్న కనికరం లేకుండా వారిని కొడుతూ.. అన్నం పెట్టకుండా మానసిక క్షోభకు గురిచేశాడు. తనను పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞత చూపకుండా ఇంటి నుంచి గెంటేశాడు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కడప జిల్లా రైల్వేకోడూరులో జరిగిన ఘటన వివరాలివి..!
వెంకట సుబ్బయ్య , సుబ్బమ్మ