ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్లో నీళ్లు.. బంక్​ సీజ్ చేయాలని వాహనదారుల డిమాండ్.. - కడప సమాచారం

కడపలోని మట్టి పెద్దపులి వీధిలోని పెట్రోల్ బంక్​లో కల్తీ పెట్రోల్​ను గుర్తించిన వాహనదారులు.. బంకు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే బంక్​ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

adulterated petrol at the petrol bunk  in kadapa district
పెట్రోల్లో నీళ్లు.. సీజ్ చేయాలని వాహనదారుల డిమాండ్..

By

Published : Jan 7, 2021, 10:34 PM IST

కడప నగరంలోని మట్టి పెద్దపులి వీధిలో ఉన్న పెట్రోల్ బంక్​లో.. కల్తీ పెట్రోల్​ వస్తుండడాన్ని వాహనదారులు గమనించారు. సీసాలో పెట్రోల్ పోయించుకున్న ఓ వ్యక్తి.. 70 శాతం మేర నీటితో కల్తీ చేయడాన్ని గుర్తించాడు. స్థానికుల సాయంతో వెంటనే పెట్రోల్ బంకు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్ బంక్ పై రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వెంటనే బంకును సీజ్ చేయాలని కోరారు. ప్రజలు ఎంతో నమ్మకంగా పెట్రోల్ పోయించుకుంటుంటే.. ఇలా మోసం చేయడం దారుణమని వాహనదారులు ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details