ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'20 లక్షల కోట్ల ప్యాకేజీ అభినందనీయం' - 20 lack crores package disscussion adhinarayanareddy

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం అభినందనీయమని మాజీ మంత్రి, భాజపా నేత ఆది నారాయణ అన్నారు.

adhinarayana reddy speak to 20 lack crores at kadapa
సమావేశంలో మాట్లాడుతున్న ఆదినారాయణరెడ్డి

By

Published : May 14, 2020, 9:50 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని.. వైకాపాతో సహా ప్రతి ఒక్కరూ స్వాగతించారని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడారు. కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా.. ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఈ ప్యాకేజీ ఇవ్వండం.. అన్ని రంగాలకు మంచి చేస్తుందన్నారు.

ప్రతి ఒక్క ఉద్యోగికి, వలస కార్మికులకు, రైతులకు, ఉపాధి హామీ కూలీలకు, విలేకరులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపినట్టుగా.. కరోనాతో సహజీవనం కాకుండా యుద్దం ప్రకటించాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details