ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతి హత్య కేసులో నిందితులు అరెస్టు - Kadapa news

ఓ యువతిని హత్య చేసిన నలుగురు నిందితులను కడప జిల్లా పోరుమామిళ్ల పోలీసులు అరెస్టు చేశారు.

డీఎస్పీ శ్రీనివాసులు

By

Published : Jul 14, 2019, 6:03 AM IST

డీఎస్పీ శ్రీనివాసులు

యువతిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను కడప జిల్లా పోరుమామిళ్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న ఆర్టీసీ బస్టాండ్​లో రాత్రి 10గంటల సమయంలో ఒంటరిగా కావ్యను తీసుకెళ్లి అనుభవించాలని పోరుమామిళ్ల పట్టణానికి చెందిన జిలానిభాష, జయసింహ, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషా పథకం పన్నారు. ఆటోలో భారత్ వాటర్​ప్లాంట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బలాత్కారం చేయబోగా కావ్య ప్రతిఘటించింది. కేకలు వేయడంతో... గొంతునులిమి చంపేశారు. అనంతరం రామాయపల్లి వైశ్య స్మశాన వాటిక వద్ద శవాన్ని పడేసి పారిపోయినట్లు మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులను తక్కువ సమయంలో అరెస్టు చేసినందుకు పోరుమామిళ్ల సీఐ మోహన్​రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details