ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YCP Leader Murder Case: వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య.. భూ దందాలు, సెటిల్మెంట్​లే కారణం: ఎస్పీ - కడప ఎస్పీ

Arrest of the accused in the murder case: కడప జిల్లాలో ఈ నెల 23న జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డిని హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ వివాదాలు, సెటిల్మెంట్లు హత్యకు దారి తీశాయని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేశామని.. కుట్రలో భాగస్వాములయితే వారిని కూడా అరెస్టు చేస్తానని స్పష్టం చేశారు.

హత్య కేసులో అరుగురు అరెస్టు
హత్య కేసులో అరుగురు అరెస్టు

By

Published : Jun 26, 2023, 4:41 PM IST

Updated : Jun 26, 2023, 8:25 PM IST

Arrest of the accused in the murder case: వైయస్సార్ కడప జిల్లాకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి ప్రధాన అనుచరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసులు రెడ్డిని ఈనెల 23న పట్టపగలు దారుణంగా హత్య చేశారు. శ్రీనివాసులు రెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు ప్రతాపరెడ్డి కూడా అతడికి సమీప బంధువేనని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు విషయంలో శ్రీనివాసరెడ్డి, ప్రతాపరెడ్డికి మధ్య మూడు నెలల కిందట విభేదాలు తలెత్తాయి. సెటిల్మెంట్​లో వచ్చిన మూడు ఆస్తులకు సంబంధించి రిజిస్టర్ పత్రాలు ప్రతాపరెడ్డి పేరుతో ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ప్రతాపరెడ్డికి రూ.80 లక్షలు, మరో నిందితుడు శ్రీనివాసులకు 60 లక్షల రూపాయలు హతుడైన శ్రీనివాసులు రెడ్డి ఇవ్వాల్సి ఉందన్నారు.

హత్య కేసులో అరుగురు అరెస్టు

సెటిల్మెంట్ల వాటాలో వచ్చిన డబ్బులు ఇవ్వాలని ప్రతాపరెడ్డి.. శ్రీనివాసులు రెడ్డిని పదేపదే అడుగుతున్న పట్టించు కోలేదనే కారణంతోనే హత్య చేయాలని ప్రతాపరెడ్డి నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 23న ప్రతాపరెడ్డి, సురేష్ కుమార్ అనే వ్యక్తులు బురఖాలు ధరించి సంధ్యా సర్కిల్లో పట్టపగలు జిమ్ నుంచి బయటికి వస్తున్న శ్రీనివాసులు రెడ్డిని దారుణంగా కొడవళ్లతో నరికి చంపారని ఎస్పీ పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత ద్విచక్ర వాహనంపై కడప శివారు ప్రాంతానికి పరారైన నిందితులు.. అక్కడే ఆయుధాలను పడేసినట్లు గుర్తించామన్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రతాపరెడ్డి, శ్రీనివాసులు, సురేష్ కుమార్, వెంకటసుబ్బయ్య, హరిబాబుతో పాటు నిందితులకు సహకరించిన రాణి అనే మహిళను కూడా అరెస్టు చేశామని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

ఏ1 ప్రతాప్ రెడ్జి, ఏ2 శ్రీనివాసులు ఇద్దరూ కూడా శ్రీనివాసులు రెడ్డితో రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. మూడు నెలలుగా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. వ్యాపార లావాదేవీ తాలూకూ ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులుకు ఇవ్వాల్సిన డబ్బు రాబట్టుకునేందుకే హత్యకు పథకం వేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. నిందితులు ఉపయోగించిన వాహనాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. మరికొందరు అనుమానితులకు కూడా నోటీసులు ఇచ్చాం. విచారణ ఇంకా కొనసాగుతుంది. - అన్బురాజన్, ఎస్పీ, వైఎస్సార్ కడప జిల్లా

దర్యాప్తు కొనసాగుతుంది...శ్రీనివాసులు రెడ్డి హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సాంకేతిక అంశాలు గూగుల్ టేక్ ఔట్ ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేశామన్న ఎస్పీ అన్బురాజన్.. విచారణలో వారి పాత్ర ఉన్నట్లు తెలితే అరెస్టు చేస్తామన్నారు. శ్రీనివాసులు రెడ్డి హత్య కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఫ్యాక్షన్ మర్డర్ అసలే కాదన్నారు. కేవలం భూ దందాలు, సెటిల్మెంట్ అంశాలే ప్రధాన కారణంగా హత్య జరిగిందని ఎస్పీ స్పష్టం చేశారు. అనవసరంగా అసత్య ప్రచారాలు చేసి కేసును తప్పుదోవ పట్టించకూడదని కోరారు. ఈ హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఎస్పీ.. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరుగురు నిందితులను కోర్టులు హాజరుపరిచి రిమాండుకు తరలించామన్నారు. నిందితులు వాడిన కొడవలి, పిడిబాకు, సెల్​ఫోన్లు, బురఖాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మహిళ ధైర్యానికి అభినందన..హత్య సమయంలో నిందితుల నుంచి వేట కొడవలి జారి కింద పడడంతో అటువైపు వెళుతున్న మహిళ ధైర్యంగా ఆ కొడవలిని వారికి అందకుండా పక్కకు పడేశారని ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలని ఎస్పీ అన్నారు. ఆ మహిళను గుర్తించామని ఆమెను పోలీస్ శాఖ తరపున సన్మానిస్తామని తెలిపారు.

Last Updated : Jun 26, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details