ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం..కడప జిల్లా చిట్వేలు మండలం నేతవారిపల్లెకు చెందిన శివయ్య 20 రోజుల క్రితం కలప కోసం అడవికి వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు కంటిచూపు మందగించిన కారణంగా.. బావిలో పడి మృతి చెందాడు. ఇంతలో గుర్తు తెలియని మృతదేహం బావిలో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందింది శివయ్యే అని నిర్ధరించిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కడప నుంచి వైద్యులను పిలిపించి శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేశారు.
బావిలో మృతదేహం.. ఆలస్యంగా వెలుగులోకి విషయం - latestnews Accidental death of a man at nethavaripalle
కడప జిల్లా చిట్వేలు మండలం నేతవారిపల్లెలో ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నేతవారిపల్లెలో బావిలో పడి వ్యక్తి మృతి