గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ
గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ - ఖాజీపేట గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ
కడప జిల్లా ఖాజీపేట మండలం బుడ్డాయిపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ రహదారిపై వెళ్తూ కారును ఢీ కొని.. గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 10 గొర్రెలు గాయపడ్డాయి. మృతి చెందిన గొర్రెల విలువ రూ. 4 లక్షలు ఉంటుందని కాశినాయన మండలం ఇటుకలపాడుకు చెందిన ముగ్గురు పెంపకం దారులు వాపోయారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ accident to the sheet flock at khajipeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6305928-445-6305928-1583408598816.jpg)
గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ