ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో కారు బోల్తా... ఒకరు మృతి - latest accident in pulivenula

మితిమీరిన వేగం...దాని ఫలితంగా ఒక కుటుంబం ఇంటి యజమానిని కోల్పోయింది. కడప జిల్లా పులివెందుల వెంకటాపురం సమీపంలోని రింగ్ రోడ్ లో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

accident in kadapa pulivendula one man died at spot
పులివెందులలో కారు బోల్తా... ఒకరు మృతి

By

Published : Dec 23, 2019, 12:00 AM IST

కడప జిల్లా పులివెందుల వెంకటాపురం సమీపంలో రింగ్ రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. వాహనంలో షరీఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్​కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

పులివెందులలో కారు బోల్తా... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details