మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్య ఇంట్లో అనిశా సోదాలు - acb rides
ప్రొద్దుటూరులో ఏసీబీ దాడులు స్థానిక అధికారుల్లో కలకలం రేపాయి. మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్య ఇంట్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఏసీబీ దాడులు స్థానిక అధికారుల్లో కలకలం రేపాయి.మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్య ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అభియోగంపై అనిశా సోదాలు చేపట్టింది. ఉదయం ఆరుగంటలకే పొద్దుటూరు చేరుకున్న ఏసీబీ అధికారులు సుబ్బయ్య ఇంట్లో సోదాలు చేపట్టారు. అనిశా డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.2 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. 568 గ్రాముల బంగారం, కేజీ 600 గ్రాముల పెండి స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య పేరున 3 గృహాలు, 2 ప్లాట్లు, భార్య పేరున 10 ప్లాట్లు, గుర్తించారు. 1991లో అనంతపురం జిల్లా రామగిరి పంచాయతీరాజ్ ఏఈఈ గా ఉద్యోగంలో చేరారు. వల్లూరు, ముద్దనూరు, కొండాపురం, దువ్వూరు, వంటి మండలాల్లో ఏఈఈగా విధులు నిర్వర్తించిన సుబ్బయ్య ప్రస్తుతం మైలవరంలో ఏఈఈగా పని చేస్తున్నారు. సుబ్బయ్య స్వస్థలం పొద్దుటూరుగా అనిశా రికార్డుల్లో తెలిసింది. ప్రస్తుతం ఆయన పేరున పొద్దుటూరు సహకార బ్యాంకులో లాకర్ గుర్తించారు. 1991 నుంచి ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా సాదాల్లో గుర్తించారు.