ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈ ఇంట్లో అనిశా సోదాలు - kadapa district latest news

కడప జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్​ కార్యాలయం డిప్యూటీ ఈఈ రాంశెట్టి సుధాకర్ ఇంట్లో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అతని బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు అనిశా డీఎస్పీ తెలిపారు. సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.

acb raids
పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈ ఇంట్లో అనిశా సోదాలు

By

Published : Apr 27, 2021, 4:59 PM IST

కడప జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోలు కార్యాలయం డిప్యూటీ ఈఈ రాంశెట్టి సుధాకర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అనిశా అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. కడపలోని సుధాకర్​ ఇంట్లో అనిశా డీఎస్పీ బృందం సోదాలు నిర్వహించారు. ఆస్తుల పత్రాలు, డబ్బు, బంగారం, బ్యాంకు ఖాతాలను ఆరా తీస్తున్నారు.

కడప నగరంలో నాలుగు చోట్ల, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, తిరుపతిలో కూడా ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ తెలిపారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతాయని.. ఏ మేరకు అక్రమంగా సంపాదించారనేది సోదాలు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి

జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు

నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న ప్రాథమిక వైద్యశాలలు సీజ్​

ABOUT THE AUTHOR

...view details