విరుపునాయనిపల్లె బీసీ వసతిగృహంలో ఏసీబీ దాడులు - acb raids on bc welfare hostel at kadapa
కడప జిల్లా విరుపునాయనిపల్లె బీసీ వసతిగృహంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. వార్డెన్ రఘురాంరాజుపై అవినీతి ఆరోపణలు రావడంతో... ఏసీబీ డీఎస్పీ జనార్ధన్నాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. 49 మంది విద్యార్థులు ఉంటే... 119 మంది ఉన్నట్టు చూపించారని డీఎస్పీ వివరించారు. ప్రభుత్వానికి ఈ నివేదిక ఇస్తామని... తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు