కడప జిల్లాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగికి సంబంధించి రావలసిన నగదు మంజూరు చేయడానికి ఐదువేల రూపాయలు లంచం తీసుకుంటున్న సీనియర్ ఆడిటర్ అబ్దుల్ జబ్బర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనిశాకు చిక్కిన సీనియర్ ఆడిటర్ - కడప జిల్లాలో ఏసీబీ వార్తలు
కడప ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఆడిటర్..అనిశా అధికారులకు చిక్కారు. ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
లంచం తీసుకుంటు.. అనిశాకు చిక్కిన సీనియర్ ఆడిటర్
మైదుకూరు మండలంకు చెందిన పెద్ద వెంకటయ్య పదవీ విరమణ పొందారు. రావాల్సిన బకాయిలను మంజూరు చేయడానికి కడప ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఆడిటర్ అబ్దుల్ జబ్బర్ రూ.5,000 లంచం అడిగాడు. బాధితుడు... అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు లంచం తీసుకుంటున్న అబ్దుల్ జబ్బర్ను పట్టుకొని.. కర్నూల్ ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఇదీ చదవండి