కడప జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. అవినీతి అక్రమాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ అన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని కడపలో సిబ్బంది గోడ పత్రాలను అతికించారు. వాహనదారులకు కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు.
వారం రోజుల పాటు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని హామీ ఇచ్చారు. అవినీతిరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.