స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని భాజపా నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని తన స్వగ్రామమైన దేవగుడిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుందని ఆరోపించారు. పులివెందుల, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజక వర్గాలకే ఆ నిధులను పరిమితం చేశారన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉద్యోగాలను అమ్ముకుంటూ గుత్తేదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుంటామన్న ఆయన.. నీటిని వృథా చేస్తున్నారని వాపోయారు. గండికోట జలాశయం నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకపోవటంతో అక్కడ 20 టీఎంసీల నీటి నిల్వ ఉంచకుండా 10 టీఎంసీలకే పరిమితం చేశారన్నారు. ఇలా అన్ని విషయాల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
'స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాం' - కడప జిల్లా దేవగుడిలో భాజపా నాయకుడు ఆదినారాయణరెడ్డి కార్యకర్తల సమావేశం
కడప జిల్లా దేవగుడిలో భాజపా నాయకుడు ఆదినారాయణరెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల్లో భాజపా విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాం'