రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీమంత్రి, భాజపా నాయకుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో నిబంధనలు మారుస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ హైకోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 66 విషయాల్లో హైకోర్టులో చుక్కెదురు అయిందని ఎద్దేవా చేశారు.
'న్యాయమూర్తులపై మంత్రుల ఆరోపణలు సరికాదు'
ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును భాజపా నేత ఆదినారాయణ రెడ్డి స్వాగతించారు. ఇప్పటికీ వైకాపా ప్రభుత్వానికి 66 విషయాల్లో హైకోర్టులో చుక్కెదురు అయిందని ఎద్దేవా చేశారు.
aadi narayana reddy
స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ కారణంగా మార్చి 15న సుమారు ఆరు వారాల పాటు వాయిదా వేసి రాష్ట్ర ప్రజలకు చాలా మేలు చేశారని ఆయన కొనియాడారు. ఆ సమయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయకుండా ఉంటే చాలామంది కోవిడ్ బారిన పడేవారన్నారు. హైకోర్టు తీర్పు విషయంలో వైకాపా మంత్రులు హైకోర్టు న్యాయమూర్తులపైన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు.
ఇదీ చదవండి:ఆపరేషన్ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?