ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త మద్యానికి బానిసయ్యాడని భార్య ఆత్మహత్యాయత్నం - కడప నేర వార్తలు

భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తాను పురుగుల మందు తాగి పిల్లలకు తాగించింది. ఈ ఘటన కడప జిల్లా పోరుమామిళ్లలో జరిగింది. స్థానికులు వారిని కడప రిమ్స్​కు తరలించారు.

భర్త మద్యానికి బానిసయ్యాడని పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యాయత్నం
భర్త మద్యానికి బానిసయ్యాడని పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 14, 2020, 11:08 PM IST

Updated : Jun 15, 2020, 1:41 AM IST

కడప జిల్లా పోరుమామిళ్లలోని ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన భార్య.. పురుగుల మందు తాగి తన ముగ్గురు పిల్లలకు పట్టించింది. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్​కు తరలించారు.

పోరుమామిళ్ల ఎస్టీ కాలనీకి చెందిన సుధీర్ బాబు, పుష్పలత భార్యభర్తలు. మద్యానికి బానిసైన సుధీర్​ బాబు.. ప్రతిరోజూ తాగొచ్చి భార్య, పిల్లలను హింసించేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పుష్పలత పురుగుల మందు తాగి.. పిల్లలకు పట్టించింది.

Last Updated : Jun 15, 2020, 1:41 AM IST

ABOUT THE AUTHOR

...view details