కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు నిర్వహిస్తున్న లాక్ డౌన్ కడపలో విజయవంతంగా సాగుతోంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలను మూసివేశారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇచ్చినందున పట్టణంలో మాల్స్ వద్ద ప్రజలు బారులు తీరారు. అనవసరంగా తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు జరిమాన విధించారు.
కడపలో కొనసాగుతోన్న లాక్డౌన్..
కరోనా రక్కసిని తరిమికొట్టేందుకు ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కడపలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై అధికారులకు సహకరిస్తున్నారు.
కడపలో విజయవంతంగా కొనసాగుతోన్న లాక్డౌన్