కడప జిల్లా రాయచోటిలో లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్న ఎన్సీసీ క్యాడెట్ షేక్ సోహైల్.. అన్నార్తులకు అండగా నిలిచాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న షేక్ సోహైల్.. ఎన్సీసీ తరఫున విధుల్లో ఉన్నాడు. తల్లిదండ్రుల సహకారంతో... 150 మందికి స్వల్ప ఆహారం పొట్లాలు పంపిణీ చేశాడు. అతడిని ఎన్సీసీ అధికారి లెప్టినెంట్ వెంకట రమణ, పోలీస్ అధికారులు అభినందిస్తున్నారు.
ఎన్సీసీ క్యాడెట్ దాతృత్వం.. 150 మందికి అన్నదానం - kadapa district
రాయచోటిలో లాక్ డౌన్ విధులకు హాజరవుతున్న ఎన్సీసీ క్యాడెట్.. చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్నాడు. 150 మందికి స్వల్ప ఆహార పొట్లాలు పంపిణీ చేశాడు.
ఎన్సీసీ విద్యార్ధి దాతృత్వం