కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ అనారోగ్యంతో మృతి చెందాడు. తమిళనాడు ధర్మపురికి చెందిన రామన్.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఈ ఏడాది జనవరిలో కడప కేంద్ర కారాగారానికి రిమాండ్ ఖైదీగా వచ్చాడు. జైలుకు వచ్చినప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. ఈ క్రమంలో కేంద్ర కారాగారం అధికారులు అతన్ని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించగా.. మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో శవ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి - కడప కేంద్ర కారాగారంలో వ్యక్తి మృతి
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు ఈ ఉదయం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కడప కేంద్ర కారాగారం