రైల్వే గేటు దగ్గరలో ట్రైన్ కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కడపజిల్లా కమలాపురం నియోజకవర్గం లోని వల్లూరు మండలం తప్పెట్ల రైల్వే గేటు వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడు వల్లూరు మండలం చిన్న లేబాక గ్రామ వాసిగా గుర్తించారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కుటుంబ కారణాలతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి... మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు.