కడప జిల్లా మైలవరం మండలం బొగ్గులపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఇటీవల నిమ్మకాయలు తీసుకుని చెన్నైకి వెళ్లారు. వీరికి అధికారులు ఈ నెల 17న కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం ముగ్గురికీ నెగిటివ్ నివేదిక వచ్చింది.
కానీ... ఒక డ్రైవర్‌కు మాత్రం నెగిటివ్, పాజిటివ్... ఏది రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఆ యువకుడికి పాజిటివ్ సోకిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేశారు. ఈ కారణంగా అధికారులు అప్రమత్తమై.. ఆ యువకుడిని మళ్లీ కొవిడ్-19 పరీక్షలు చేసేందుకు ప్రొద్దుటూరు తీసుకెళ్లారు.