పశువుల వ్యాపారం చేసుకునే తనపై హత్యాయత్నం చేసి కాలు పోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవటంలో పోలీసులు జాప్యం వహిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా చిన్నమండెం మండలానికి చెందిన ఆంజనేయులు పశువుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాపారం నిమిత్తం ఎగువపల్లె గ్రామాకి వెళ్లాడు. స్థానికంగా ఉండే కొందరూ తమ ఊర్లోకి వచ్చి వ్యాపారం ఎలా చేస్తావు అని ప్రశ్నించి అక్కడ్నుంచి పంపించేశారు.
'నాపై హత్యాయత్నం చేశారు'
జూన్ 19వ తేదీన ఎగువపల్లె గ్రామానికి వెళ్లాను. రాజారెడ్డి, బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తులు... ట్రాక్టర్‌తో నన్ను చంపేందుకు యత్నించారు. ఈ ప్రమాదంలో నా కాలు పూర్తిగా విరిగిపోయింది. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. నాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబమంతా నాపైనే ఆధారపడి బతుకుంతోంది. పోలీసులు స్పందించి నాకు తగిన న్యాయం చేయాలి' - ఆంజనేయులు, బాధితుడు