మాయ మాటలు చెప్పి ఓ బాలికను లోబరుచున్న దుర్మార్గుడు... ఆమెను గర్భవతి చేశాడు. ఈ సంఘటన కడపలో జరిగింది. కడప పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక.. కడప శంకరాపురానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి వద్దకు బేల్దారి కూలీ పనికి వెళ్లేది. నరేంద్రకు ఇదివరకే వివాహమై కొడుకు ఉన్నాడు.
అలాంటి నరేంద్ర... బాలికకు మాయమాటలు చెప్పి లోబరచుకుని గర్భవతిని చేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. వారు రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్రపై అత్యాచారం కేసుతో పాటు.. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు కడప సీఐ సత్య బాబు తెలిపారు.