కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని చౌడూరు వద్ద భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయాయి. గ్రామంలోని పంట పొలాల వద్ద ఈ పరిస్థితి మరీ దారుణం. రబీ సీజన్‌లో వర్షాలతో పంట పొలాలు నీటితో కళకళలాడుతుంటాయి. సరైన జల సంరక్షణ చర్యలు తీసుకోనందున కొన్ని నెలల తరువాత ఆ ప్రాంతం ఎడారిని తలపిస్తుంది. రైతులు తమ పొలాల్లో సాగు చేసే శనగ పంటకు క్రిమిసంహారక మందులను పిచికారి చేసేందుకు... అవసరమైన నీటి కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను గమనించిన ఓ వ్యక్తి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. అడపా దడపా కురిసే వర్షాలు... రబీ సీజన్‌లో పంట పొలాల నుంచి వృథాగా వచ్చే జలాలలను భూగర్బంలో ఇంకింపజేసేందుకు భారీ కందకాన్ని తవ్వుతున్నారు.
కరువును తరిమేసే యత్నం... అతని సంకల్పం! - daddy home
ఆ ప్రాంతంలో కీచురాళ్ల అరుపులు మినహా మనుషులెవ్వరూ కనుచూపు మేర కనబడరు. పశు పక్ష్యాదులు సైతం అక్కడ సంచరించవు. కారణం గొంతు తడుపుకోవడానికి అక్కడ చుక్క నీరు లభించదు. అలాంటి ప్రాంతంలో నీటిని ఒడిసి పట్టేందుకు ఓ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు.
సొంత నిధులతో
చౌడూరు గ్రామంలోని ఉన్న పూజా ఇంటర్నేషనల్ పాఠశాల ఛైర్మన్ రాజారెడ్డి... 5 లక్షల రూపాయలు వెచ్చించి కందకం తవ్విస్తున్నారు. పది రోజులుగా ఈ పనులు జరుగుతున్నాయి. గ్రామ పరిసరాల్లో 250 మీటర్ల మేర ఈ కందకాన్ని తవ్విస్తున్నారు. పంట పొలాల నుంచి వచ్చే నీరు ఇందులోకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పశుపక్ష్యాదులకు సైతం నీటి తొట్టెలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరగడంతోపాటు రైతుల అవసరాలకు ఉపయోగపడుతుందని... అందుకోసమే వృథా జలాలను ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్నట్లు రాజారెడ్డి చెబుతున్నారు. తమ ప్రాంతంలోని కరవు పరిస్థితులు విద్యార్థులకు వివరించేందుకు... ఈ కందకం వద్దే పూజా పాఠశాల యాజమాన్యం చిన్నారులకు జల సంరక్షణ, నీటి నిర్వహణ పాఠాలు చెబుతోంది.
ఇదీ చదవండీ... 'మనకున్న ఒకే ఒక్కదారి... మొక్కల్ని పెంచడం'