కడప జిల్లా వీయన్‌పల్లె మండలంలోని మిట్టపల్లె గ్రామానికి చెందిన గజ్జల రామ్మోహన్‌రెడ్డి సీఎం సహాయ నిధికి లక్ష విరాళం అందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి చెక్కు అందజేశారు. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే విరాళం ఇచ్చినట్లు దాత తెలిపారు. అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు వీధుల్లో ఆయన హైపో ద్రావణం పిచికారీ చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వ్యక్తిగత దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
కరోనా నివారణకు సీఎం సహాయ నిధికి లక్ష విరాళం - donations to cm relief fund news
కరోనా విపత్తు సహాయార్థం ప్రభుత్వ సహాయ నిధికి దాతలు విరాళం అందిస్తున్నారు. కడప జిల్లా మిట్టపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్‌కు లక్ష విరాళం అందించారు.
కరోనా నివారణకు సీఎం సహాయ నిధికి లక్ష విరాళం