ఇసుక అక్రమ రవాణాలో విషాదం జరిగింది. వేగంగా ట్రాక్టర్ నడుపుతూ... ఇసుక తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరు నుంచి... ఓ కాలేజి నిర్మాణానికి ఇసుక తరలిస్తుండగా... ట్రాక్టర్ అదుపుతప్పి రేకుల కొట్టంలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ పుష్పరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఇసుక అక్రమ రవాణా... ప్రాణం తీసిన అతివేగం - proddutur lo accident news
ఎవరికీ తెలియకుండా ఇసుక తరలించాలని... వేగంగా వాహనం నడిపాడు. ఆ అతివేగమే ప్రాణం తీసింది. ఈ ఘటన ప్రొద్దుటూరులో జరిగింది.

ట్రాక్టర్ డ్రైవర్ పుష్పరాజ్ మృతదేహం