కడప జిల్లా కోటిరెడ్డి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివేకానంద నగర్‌కు చెందిన రామచంద్రారెడ్డి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. కోటిరెడ్డి కూడలి సమీపంలో ఆటోల కోసం ప్రత్యేకంగా వేసిన ఇనుప బారికేడ్లు తగిలి కిందపడ్డాడు. అదే సమయానికి అటు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడం వలన రామచంద్రారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలు
బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక వివేకానంద నగర్‌కు చెందిన రామచంద్రారెడ్డి కోటిరెడ్డి కూడలి సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో అటుగా వస్తోన్న ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి వెళ్లి అతను అక్కడికక్కడే చనిపోయాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి