ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accidental death : వేంపల్లెలో వ్యక్తి మీద అద్దాలు పడి మృతి - కడప జిల్లాలో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు

Accidental death
వేంపల్లెలో వ్యక్తి మీద అద్దాలు పడి మృతి

By

Published : Sep 29, 2021, 1:53 PM IST

Updated : Sep 29, 2021, 4:23 PM IST

13:48 September 29

Accidental death : వేంపల్లెలో వ్యక్తి మీద అద్దాలు పడి మృతి

కడప జిల్లా వేంపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని  నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని ఓ దుకాణానికి  ఆటో క్యాంపర్ లో  అద్దాల లోడు వచ్చింది. అద్దాలను అన్ లోడ్ చేసే సమయంలో అద్దాలు మీద పడి అస్సాంకు చెందిన రాహుల్  కుత్తమ్ అనే యువకుడు మృతి చెందాడు. అద్దాలలో ఇరుక్కున్న  యువకుడిని కాపాడేందుకు  స్థానికులు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.  ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అద్దాల మధ్య ఇరుక్కున్న రాహుల్ ని కాపాడే క్రమంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి :     Ex mla Ramana reddy passed away: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కన్నుమూత

Last Updated : Sep 29, 2021, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details