ఐదేళ్ల సహజీవనం తరువాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని ఓ మహిళ మీడియాను ఆశ్రయించింది. కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంతి ఇదివరకే వివాహమై కొడుకు ఉండగా... భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జీవనోపాధి కోసం ఆమె హైదరాబాద్‌లో స్థిరపడింది. అక్కడ కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి...పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోమని బాధితురాలు ఒత్తిడి చేయగా ముఖం చాటేశాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు నెలలు గడిచినప్పటికీ తన కేసును పట్టించుకోవట్లేదని... వారు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని బాధితురాలు వాపోయింది. సుదర్శన్‌రెడ్డి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని... తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
నిజాయతీ నచ్చిందన్నాడు..నట్టేట ముంచాడు - పులివెందులలో మహిళను మోసం చేసిన వ్యక్తి
ఐదేళ్ల సహజీవనం తరువాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని ఓ మహిళ మీడియాను ఆశ్రయించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.
బాధితురాలు ప్రశాంతి