కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతను వెన్నుతట్టి ప్రోత్సహించిన గొప్ప మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. అలాంటి మహానుభావుని వేషధారణతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన పుల్లయ్య... అందరినీ ఆకట్టుకుంటున్నారు. చామనఛాయ రంగు కలిగిన పుల్లయ్య... కలాంలా బూట్లు వేసుకోవడం.. కోటు ధరించడం... తల వెంట్రుకలను కూడా ఆయనకు ఉన్నట్లుగానే తీర్చిదిద్దుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. దైనందిన కార్యక్రమాల్లోనూ అలాగే పాల్గొంటున్నారు. వేషధారణ చూసిన ప్రతి ఒక్కరూ కలాంనే ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు. ఇదే విషయమై.. ఈటీవి భారత్ పుల్లయ్యను పలకరించగా.. కలాం తనకు స్ఫూర్తి, దైవం అని చెప్పుకొచ్చారు.
అబ్దుల్ కలాం.. ఇలా మళ్లీ వచ్చారు! - a man like abdul kalam latest news
ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశం గర్వించదగిన మహానుభావుడు. కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతను వెన్నుతట్టి ప్రోత్సహించిన మహా వ్యక్తి ఆయన. అలాంటి మహానుభావుని వేషధారణతో పుల్లయ్య అనే వ్యక్తి అందరిని ఆకట్టుకుంటున్నాడు.

అబ్దుల్ కలాంలా మారిన పుల్లయ్య