MURDER: వ్యక్తి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా..? - latest news of proddutur crime news
10:39 September 20
man murdered at prodhutur
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్య(Murder in Proddatur) జరిగింది. దొరసానిపల్లెకు చెందిన తిరుమలేశ్వరరెడ్డి (35) హత్యకు గురయ్యాడు. హత్య చేసి మృతదేహాన్ని మూటకట్టి కొత్తపేటలోని ఓ ఇంట్లో ఉంచారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ ఠాణా పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి..
MISSING IN CANAL: కెనాల్‌లో ముగ్గురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం