కడపకు చెందిన ఓ వ్యక్తి.. అనారోగ్యంతో ఉన్న తన పెంపుడు కుక్కకు స్థానిక పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు.. చనిపోయిన శునకాన్ని తీసుకొచ్చారని చెప్పడంతో అతను ఆగ్రహానికి గురయ్యాడు. వైద్యం చేయలేదనే కోపంతో ఆసుపత్రి అద్దాలను రాళ్లతో పగలగొట్టి అక్కడే ఉన్న రెండు కార్లపై దాడి చేశాడని.. అడ్డువచ్చిన సిబ్బందిని రాళ్లతో కొట్టాడని పశువుల డాక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశువుల ఆసుపత్రిపై ఓ వ్యక్తి రాళ్లతో దాడి.. ఎందుకంటే! - latest news of animal hospital at kadapa
చనిపోయిన కుక్కను తీసుకొచ్చి వైద్యం చేయలేదని పశువుల ఆసుపత్రిపై ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కడప పశువుల ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది.

పశువుల ఆసుపత్రిపై దాడి