ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగంపేట వద్ద రోడ్డు ప్రమాదం... 20 మందికి తీవ్ర గాయాలు - ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

కడప జిల్లా మంగంపేట వద్ద ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొనడంతో బస్సులోని 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

a lorry hit by a rtc bus at mangampeta chervu
మంగంపేట వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : Feb 13, 2021, 8:45 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట వద్ద ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. మంగంపేట వద్ద తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.

రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఓబులవారిపల్లి పోలీసులు పేర్కొన్నారు. ఈ లారీ తమిళనాడుకు చెందినదిగా గుర్తించారు.

ఇదీ చదవండి:అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details