కడప జిల్లా కమలాపురంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాగేరు వాగు తగ్గటంతో రాకపోకలు సాగుతున్నాయి. అయితే ఆదివారం రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో నీటి ప్రవాహంలో దారి సరిగా కనిపించకపోవటంతో... వంతెన మీద నుంచి లారీ బోల్తాపడింది. చాకచక్యంతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని విచారించారు. ఎర్రగుంట్ల నుంచి నెల్లూరు వెళ్తునట్లు వారు తెలిపారు.
నీటి ప్రవాహంలో కనిపించని దారి...బోల్తా పడిన లారీ - కడప తాజా వార్తలు
నీటి ప్రవాహంలో దారి సరిగా కనిపించకపోవటంతో....వంతెనపై నుంచి లారీ కిందపడిన ఘటన కడప జిల్లా కమలాపురంలో జరిగింది.
కమలాపురంలో లారీ బోల్తా