ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RESIGNED JOB: భువనేశ్వరిపై వ్యాఖ్యలకు నిరసనగా.. ఉద్యోగానికి రాజీనామా - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు

చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. సీఎం సొంత జిల్లా రైల్వే కోడూరులో ఓ మహిళా ఉద్యోగిని రాజీనామా చేశారు. అసెంబ్లీ సాక్షిగా మహిళకు జరిగిన అవమానాన్ని భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

RESIGNED JOB
RESIGNED JOB

By

Published : Nov 21, 2021, 9:27 PM IST


కడప జిల్లా రైల్వే కోడూరులో.. ఎర్రగుంట్ల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్న దుద్యాల అనితా దీప్తి అనే ఉద్యోగిని(WOMEN EMPLOYEE RESIGNED TO JOB) తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో వైకాపా మంత్రులు(YSRCP MINISTERS COMMENT ON BHUVANESWARI).. తెదేపా అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తన నిర్ణయాన్ని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వంలో తాను ఉద్యోగం చేయలేనని.. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో అనేక ఒత్తిళ్లకు గురయ్యానని వాపోయారు. అసెంబ్లీలో ఒక మహిళకు జరిగిన అవమానాన్ని భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతోపాటు తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేసి.. ముఖ్యమంత్రి, మంత్రులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details