కడప జిల్లా రైల్వే కోడూరు మండలం చియ్యవరం గ్రామంలో కార్తిక దీపం ఓ ఇంటికి శాపమైంది. ఆలయంలో దీపం వెలిగించేందుకు వెళ్లిన పాప దుస్తువులకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గాయపడింది.
కార్తిక దీపం.. బాలిక పాలిట శాపం.. - kadapa district latest news
ఎంతో సంబరంగా కార్తిక దీపం వెలిగించేందుకు గుడికి వెళ్లిన ఓ బాలిక అగ్నికీలల్లో చిక్కుకుంది. కాలిన గాయాలతో తల్లడిల్లుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
గాయపడిన బాలిక
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తల్లితో పాటు దీపం వెలిగించేందుకు కావేరి(7) అనే బాలిక గుడికి వెళ్లింది. ఆలయ ప్రాంగణంలో ఆడుతుంటే..పాప గౌనుకు దీపం అంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే బాలికను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి హాస్పటల్‌కు తీసుకెళ్లమని వైద్యులు సూచించారు.
ఇదీ చదవండి: కడపలో తగ్గుతున్న అమ్మాయిల జనాభా