కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేటలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వగా... వారు వచ్చే లోపే దగ్ధమైంది. గ్రామానికి విద్యుత్ సరఫరా ఆగిపోగా తాగునీటి పథకం బోర్లు మోటార్లు పనిచేయ లేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయదారులకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధికారులు సరైన సమయానికి స్పందించి ఉంటే ప్రమాద స్థాయి తక్కువగా ఉండేదని స్థానికులు వాపోయారు. అలాగే సమస్య ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కు త్వరగా మరమ్మతులు చేయాలని విన్నవించారు.
మంటలు చెలరేగి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం
అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. అసలే విద్యుత్ కనెక్షన్లు అందక అల్లాడుతుంటే...ఉన్న వాటిని సకాలంలో మరమ్మతులు చేపట్టక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రహదారుల విద్యుత్ లైన్ల వెంట చెట్లు పెరిగి విద్యుత్ స్తంభాలకు చుట్టుకుంటున్నాయి. అవి గాలికి చెట్లకు తగిలి మంటలు చెలరేగటం, ఫీజులు ఎగిరిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకొవాలని స్థానికులు విన్నవిస్తున్నారు.
మంటలు చెలరేగి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం