కడప జిల్లా బద్వేలు పట్టణంలో.. నెల్లూరు రోడ్డులో ఉన్న శ్రీనివాస సప్లయర్స్ డెకరేషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పొగలు మంటలు వ్యాపిస్తుండటంతో.. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో 20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని సిబ్బంది తెలిపారు.