ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కత్తితో పొడిచి తండ్రిని హత్య చేసిన కుమారుడు - కత్తితో పొడిచి తండ్రిని హత్య చేసిన కొడుకు

డబ్బులు విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం కాస్త చివరకు ఆ తండ్రి హత్యకు దారి తీసింది. ఈ అమానవీయ ఘటన కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

a father murder by him son at Kadapa
కత్తితో పొడిచి తండ్రిని హత్య చేసిన కొడుకు

By

Published : Dec 10, 2020, 7:18 AM IST

కడపలోని రవీంద్రనగర్​లో విషాద చోటుచేసుకుంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో తండ్రి హత్యకు గురయ్యాడు. రవీంద్రనగర్​కు చెందిన సయ్యద్ కాసిం సాహెబ్​కు నలుగురు సంతానం. 2వ కుమారుడు ముబారక్.. జులాయిగా తిరుగుతున్నాడు. అయితే తండ్రి కాసిం సాహెబ్ ఇటీవల ఓ స్థలాన్ని విక్రయించాడు. దానికి సంబంధించి డబ్బు విషయంలో ముబారక్, సాహెబ్​ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ముబారక్ పక్కనే ఉన్న కత్తితో తండ్రి కడుపులో పొడవగా.. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప పోలీసులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details