ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్లాడుపల్లె వీరభద్రస్వామికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం!

కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలోని వీరభద్ర స్వామి ఆలయానికి ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ. 80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు సమర్పించాడు. అజ్ఞాత భక్తుడు కానుకలు సమర్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

A devotee donates to Veerabhadraswamy in Alladupalle Kadapa district
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/11-January-2021/10203405_1.png

By

Published : Jan 11, 2021, 7:44 PM IST

కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలోని వీరభద్రస్వామి ఆలయానికి ఓ అజ్ఞాత భక్తుడు బంగారు ఆభరణాలను సమర్పించాడు. వీటి విలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయంలోని మూలవిరాట్టు వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారు, శివలింగానికి వేద పండితులు వాటిని అలంకరించి పూజలు చేశారు. అజ్ఞాత భక్తుడు కానుకలు సమర్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details