కడప జిల్లా మైదుకూరులో పదమూడు నెలల బాలుడు మృతి చెందాడు. షేక్ నూర్‌బాషా దంపతులకు రెండో కుమారుడు షేక్ అహ్మద్ పక్కనే ఉన్న అవ్వ ఇంట్లో ఆడుకుంటూ.. స్నానాల గదిలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి బకెట్ పడ్డాడు. ఇంట్లోని వారు బాలుడిని గుర్తించేటప్పటికే మరణించాడు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. గతనెలలోనే ఆ బాలుడి మొదటి జన్మదిన వేడుకలను జరిపించారు. అరచేతిలో అల్లారు ముద్దుగా పెరిగిన చిన్నారి అనంతలోకాలను చేరటంతో.. తల్లిదండ్రుల రోదించే తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
నీటి బకెట్లో పడి బాలుడు మృతి - child died news
ముద్దుముద్దుగా అల్లరి చేస్తుండే బాలుడు మృత్యుఒడికి చేరాడన్న నిజం ఆ కుటుంబ సభ్యుల హృదయాలను తొలిచేస్తోంది. గత నెల.. చిన్నారి మొదటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతలోనే నూరేళ్లు నిండాయి.
మృతి చెందిన బాలుడు