ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

A Bridge on Penna river: రోజురోజుకూ కుంగుతున్న.. పెన్నా నది బ్రిడ్జి - జమ్మలమడుగు సమీపంలో పెన్నా నది

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో (bridge-on-penna-river-near-jammalamadugu) పెన్నా నదిపై నిర్మించిన వంతెన రోజురోజుకూ కుంగిపోతోంది. భారీ వరద ప్రవాహం కారణంగా మూడు రోజుల క్రితం కుంగిన ఒక పిల్లర్.. రోజురోజుకూ నదిలోకి ఒరిగిపోతోంది.

రోజురోజుకూ కుంగుతున్న పెన్నా నదిపై ఏర్పాటు చేసిన వంతెన
రోజురోజుకూ కుంగుతున్న పెన్నా నదిపై ఏర్పాటు చేసిన వంతెన

By

Published : Nov 24, 2021, 4:55 PM IST

కడప జిల్లా జమ్మల మడుగు సమీపంలో(bridge-penna-river-jammalamadugu) పెన్నా నదిపై నిర్మించిన వంతెన మరింత కుంగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నెల 19వ తేదీన లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ నీటి ప్రవాహం కారణంగా జమ్మల మడుగు సమీపంలోని పెద్ద వంతెన మూడు రోజుల క్రితం కుంగిపోయింది.

16వ నెంబరు స్తంభం కొద్ది కొద్దిగా నదిలోకి ఒరిగిపోతోంది. పోలీసులు అప్రమత్తమై రాకపోకలు నిషేధించారు. నేషనల్ హైవే అధికారులు పరిశీలించి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. పక్కన్నే ఉన్న పాత వంతెనకు మరమ్మతులు చేసి, రాకపోకలు సాగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో.. బ్రిడ్జి కుంగుబాటు సైతం మెల్లగా కొనసాగుతోంది. పెన్నా నదికి నీటి విడుదలను నిలిపేస్తే.. వీలైనంత త్వరగా పాత వంతెనకు మరమ్మతులు చేపడతామని నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కుంగిన వంతెనపై దృష్టిసారిస్తామంటున్నారు.

ఇదీ చదవండి:Rayala Cheruvu Repair: రాయల చెరువు గండికి.. కొనసాగుతున్న మరమ్మతులు

ABOUT THE AUTHOR

...view details