కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని ఉప్పరపల్లి హరిజనవాడలో విషాదం చోటు చేసుకుంది. హర్షిత్(5) అనే బాలుడు విద్యుదాఘాతంతో ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం తల్లి శైలజ ఇంటి బయట కూర్చుని హర్షిత్‌కు అన్నం తినిపించింది. అనంతరం చెయ్యి కడుక్కొని వస్తానంటూ బాలుడు ఇంట్లోని బాత్రూమ్కు వెళ్లాడు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి హర్షిత్ మృతి చెందాడు.
ఉప్పరపల్లిలో విషాదం.. విద్యుదాఘాతంతో బాలుడు మృతి
కడప జిల్లా ఉప్పరపల్లి హరిజనవాడలో విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు
ఉప్పరపల్లిలో విద్యుదాఘాతంతో బాలుడు మృతి