- అమూల్ సంస్థకు చిత్తూరు డెయిరీ లీజు.. మంత్రివర్గం ఆమోదం
రాష్ట్రంలో ఏపీ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 జనవరి నుంచి పెన్షన్ పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణతోపాటు.. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో వైకాపా కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపులకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21న 5 లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బకాయిలు అడగకూడదని.. జీతాలు ఆలస్యం చేస్తున్నారా..? : బొప్పరాజు
ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చల్లించకపోవటంపై ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి భరిస్తూ వస్తున్నామని.. కానీ ప్రభుత్వానికి ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. జీతభత్యాల కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇప్పటివరకు ఏపీకి రూ.23 వేల కోట్లు ఆర్థిక సాయం: కేంద్రం
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు 23వేల 110.472 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ రాజ్యసభకు తెలిపింది. చట్టంలోని పలు సెక్షన్లలో పేర్కొన్న విధంగా.. రెవెన్యూ లోటు భర్తీ కింద, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద, రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించిన హైకోర్టు
కోర్టు ధిక్కరణ కేసులో తితిదే ఈవో ధర్మారెడ్డికి హైకోర్టు జైలుశిక్ష విధించింది. క్రమబద్దీకరణ విషయమై టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ముగ్గురు ఉద్యోగులను ముగ్గురు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు చేయలేదంటూ.. ఉద్యోగులు మరోసారి కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐపీఎస్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళపై కాల్పులు.. హైకోర్టుకు వెళ్లే ముందే..
ఝార్ఖండ్‌లో ఓ గిరిజన మహిళపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఆమె హైకోర్టులో హాజరు కావడానికి కొన్ని గంటల ముందే.. ఆమెపై దాడి జరిగింది. దీంతో ఈ దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైబర్ నేరగాళ్ల మోసం.. ఒక్క మిస్డ్‌కాల్‌తో రూ.50 లక్షలు స్వాహా
ఓటీపీ అవసరం లేకుండా మిస్డ్‌కాల్స్ ద్వారా ఓ వ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.50 లక్షల నగదును కొట్టేశారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో ఇది కొత్త తరహా మోసం అని పోలీసులు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సరిహద్దులో ఘర్షణపై స్పందించిన చైనా.. ఏం చెప్పిందంటే?
తవాంగ్ సెక్టార్‌లో భారత్ సైనికులతో జరిగిన ఘర్షణపై చైనా స్పందించింది. సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగానే ఉందని పేర్కొంది. అన్ని ఒప్పందాలను భారత్ అమలు చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడు రంగుల్లో ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్.. ఎవరికి ఏ కలర్ ఇస్తారంటే?
ఇప్పటిదాకా బ్లూ కలర్లో ఉన్న ట్విట్టర్ వెరిఫికేషన్ మార్క్ ఇప్పుడు మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ పేర్కొన్నారు. అలానే ట్విటర్ సంస్థలో 'ట్రస్ట్ అండ్ సేఫ్టీ కౌన్సిల్'ను యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- IND VS BAN: టెస్ట్ సమరానికి రంగం సిద్ధం.. టీమ్ఇండియా ఏం చేస్తుందో?
పసికూన అనుకొంటే రెచ్చిపోయి బలమైన టీమ్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. తాజాగా మరో సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అదే బంగ్లాదేశ్. బుధవారం నుంచి టీమ్ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లో గాయాల బాధ వెంటాడుతున్న టీమ్‌ఇండియాను రాహుల్ ద్వయం ఎలా ముందుకు తీసుకెళ్తుందేమోనని అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టైలిష్ డ్రెస్సుల్లో భామల ఫోజులు అందానికే అసూయ పుట్టేలా ఉన్నాయిగా
స్టైలిష్ డ్రెస్సుల్లో టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ తారలు హొయలొలికించారు. మిరుమిట్లు గొలిపే దుస్తుల్లో గ్లామర్ డోస్ పెంచుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తమ ఫొటోలను పంచుకున్నారు. ఆ స్టైలిష్ డ్రెస్సుల్లో ఈ భామలు ఎలా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS