ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RANGOLI: ముగ్గు వేసిన 95 ఏళ్ల వృద్ధురాలు...వీడియోకు నెటిజన్లు ఫిదా - rangoli

ఇంటిముందు అందమైన ముగ్గులు వేయడం ఓ కళ. అయితే రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దేందుకు కొందరు నేటి తరం మహిళలు కాస్త ఇబ్బంది పడతారు. కానీ కడప జిల్లా నందిమండలం గ్రామానికి చెందిన 95 ఏళ్ల వృద్ధురాలు ఇంటి ముందు ముగ్గు వేసి అందరినీ ఆశ్చర్యపరచింది.

ముగ్గు వేసిన 95 ఏళ్ల వృద్ధురాలు
ముగ్గు వేసిన 95 ఏళ్ల వృద్ధురాలు

By

Published : Jan 15, 2022, 11:14 AM IST

ముగ్గు వేసిన 95 ఏళ్ల వృద్ధురాలు

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన 95 ఏళ్ల వృద్ధురాలు ముగ్గు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిగా నడవలేని పరిస్థితిలో కూడా పండగ వేళ తన ఇంటి ముందు ముగ్గు వేసింది. బండపై కూర్చొని తనకు వచ్చిన రీతిలో ముగ్గువేసి ఆనందపడింది. మరోవైపు కర్నూలు జిల్లాలో తీరొక్క ముగ్గులతో మహిళలు పండగ శోభను రెట్టింపు చేశారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details