ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయచోటిలో ఘనంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవం - 74th Independence Day Celebrations at Rayachoti

74వ స్వాతంత్య్ర దినోత్సవాలను కడప జిల్లా రాయచోటిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

74th Independence Day Celebrations at Rayachoti
రాయచోటిలో ఘనంగా 74వ స్వాతంత్ర వేడుకలు

By

Published : Aug 15, 2020, 8:16 PM IST

74వ స్వాతంత్య్ర దినోత్సవాలను కడప జిల్లా రాయచోటిలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం గురించి వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశ నాయకుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగ కోటేశ్వరమ్మ, న్యాయస్థానాలపై జిల్లా ఐదవ అదనపు కోర్టు న్యాయమూర్తి లక్ష్మి, పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్సీ జకియా, మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, రెవెన్యూ పోలీసు రోడ్లు భవనాల శాఖ పంచాయతీ రాజ్ ఎంపీడీవో కార్యాలయం మార్కెట్ యార్డ్ ఆర్టీసీ డిపో తదితర కార్యాలయాలపై ఆయా శాఖల అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జెండా వందనం చేసి స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

ఇవీ చదవండి:

ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details