కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కమలాపురం వద్ద కుందూ నది ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ముగ్గురు చిన్నారులు వరదలో కొట్టుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపురం - ఖాజీపేట మధ్యలో ప్రవహిస్తున్న కుందూనది చూడటానికి జాఫర్ హుసేన్తోపాటు వారి ముగ్గురు పిల్లలు వెళ్లారు. ఈ సమయంలో కుందూనదిలో దిగి సరదాగా ఈత కొడుతుండగా.. ప్రవాహంలో కొట్టుకుపోయారు. తండ్రి జాఫర్ హుసేన్ మృతదేహాన్ని కమలాపురం సమీపంలోని ముళ్లపొదల్లో స్థానికులు గుర్తించారు. ముగ్గురు పిల్లలు జాకీర్, ఇర్ఫాన్, షాహిద్ గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం అందగా.. కుందూనది వద్దకు చేరుకున్నారు. ముగ్గురి పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కడప జిల్లా... కుందూ నదిలో నలుగురు గల్లంతు - కమలాపురం
కడప జిల్లా కమలాపురం వద్దనున్న కుందూ నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమవగా... మరో ముగ్గురు చిన్నారుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
4-members-missing-in-kundu-river