ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేలులో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా...! - vehicle cheking

కడప జిల్లా బద్వేలు పురపాలికలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వెనక భాగంలో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.

రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.

By

Published : Apr 24, 2019, 8:17 PM IST

బద్వేలులో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా...!

కడప జిల్లా బద్వేలు పురపాలికలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వెనక భాగంలో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. 959/1 సర్వే నెంబర్​ లో ఉన్న ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి కట్టడానికి పోగా ఈ స్థలం మిగిలి ఉంది. అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న కబ్జారాయిళ్లు... సమారు ఒక ఎకరా స్థలంలో అక్రమంగా రేకుల షెడ్డులను నిర్మించారు.

వీరు ఆక్రమణ చేసిన స్థలం సుమారు రూ.3 కోట్ల విలువ చేస్తుంది. పురపాలక అధికారుల దృష్టికి.. ఈ కబ్జా వ్యవహారం చేరడంతో పోలీసు భద్రతతో కట్టడాలను కూల్చివేశారు.

ABOUT THE AUTHOR

...view details