కార్తిక పూర్ణిమ సందర్భంగా కడప జిల్లా రాజంపేట పట్టణంలోని సాయి నగర్లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 36 అడుగుల వాయు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. నింగిని తాకినట్లుగా ఉన్న శివలింగాన్ని దర్శించుకుని భక్తులు తరించారు. కార్తిక మాసంలో పరమాత్ముడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని రాజయోగ రాజంపేట డివిజన్ సభ్యురాలు సావిత్రి తెలిపారు.
36 అడుగుల వాయు శివలింగం.. వెల్లివిరిసిన ఆధ్యాత్మికం.. - Rajampeta 36 feet Vayu Shiva Lingam news in telugu
కార్తిక పూర్ణిమ పురస్కరించుకుని కడప జిల్లాలో ఏర్పాటు చేసిన 36 అడుగుల వాయు శివలింగం భక్తులను ఆకట్టుకుంది. బ్రహ్మశ్రీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాయు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
![36 అడుగుల వాయు శివలింగం.. వెల్లివిరిసిన ఆధ్యాత్మికం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5041386-299-5041386-1573561267098.jpg)
36 feet Vayu Shiva Lingam for devotees in Rajampeta
భక్తుల సందర్శనార్థం 36 అడుగుల వాయు శివలింగం ఏర్పాటు
ఇదీ చూడండి: